Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీ జీవితాన్ని నాశనం చేస్తా: రాఖీ సావంత్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న మాజీ ప్రియుడు

  • రాఖీ సావంత్ పెళ్లి చేసుకోవడంతో షాక్ కు గురైన దీపక్ ఖలాల్
  • రూ. 4 కోట్లు ఇవ్వాలని డిమాండ్
  • నీవు నన్నేమీ చేయలేవంటూ రాఖీ సావంత్ రిప్లై
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవలే రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ ఎన్నారైను ఆమె పెళ్లాడింది. తనకు యూకే వీసా రావాల్సి ఉందని... వీసా రాగానే తన భర్త దగ్గరకు వెళ్లిపోతానని ఆమె ప్రకటించింది.

మరోవైపు, రాఖీ వివాహం చేసుకోవడంతో ఆమె మాజీ ప్రియుడు దీపక్ ఖలాల్ షాక్ కు గురయ్యాడు. దీపక్ ను పెళ్లాడబోతున్నానని కొన్ని నెలల క్రితం రాఖీ సావంత్ ప్రకటించింది. ఆ తర్వాత దీపక్ ను పెళ్లి చేసుకోబోవడం లేదని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇంతలోనే ఎన్నారైను పెళ్లాడింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా దీపక్ ఓ వీడియోను షేర్ చేశాడు. రాఖీ సావంత్ తనకు రూ. 4 కోట్లు ఇవ్వాలని ఈ వీడియోలో డిమాండ్ చేశాడు. నాలుగు రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే... ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని హెచ్చరించాడు.

దీపక్ హెచ్చరికలపై రాఖీ సావంత్ ఘాటుగానే స్పందించింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావని... తన భర్త గురించి తప్పుగా మాట్లాడుతున్నావని మండిపడింది. నీవు నన్నేమీ చేయలేవని తెలిపింది.
Rakhi Sawant
Deepak Kalal
Marriage
Bollywood

More Telugu News